Logo
Date of Publish : 16 September 2026, 1:30 pm
Editor : Janapati Venkata Ramesh Babu

క్రికెట్ లోఅవకాశాలను సద్వినియోగం చేసుకోండి

  • ఆర్డిటి గ్రామీణ క్రికెట్ ప్రతిభా అన్వేషణకు మడకశిరలో విశేష స్పందన
  • మచ్చా రామలింగారెడ్డి చైర్మన్, క్రికెట్ డెవలప్‌మెంట్ కమిటీ, RDT

అనంతపురము, 16 సెప్టెంబర్ 2026:

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రతిభ ఉన్న యువ క్రికెటర్లను గుర్తించి ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎంతోమంది ప్రతిభ ఉన్న యువ క్రికెటర్లు ఉన్నారని వారిని గుర్తించి ప్రోత్సహించడమే లక్ష్యంగా ఆర్డిటి ఒక ప్రత్యేక కార్యక్రమం తీసుకున్నదని మచ్చా రామలింగారెడ్డి అన్నారు గ్రామీణ ప్రాంతాల్లోని యువ క్రికెట్ ప్రతిభను గుర్తించి, వారికి శిక్షణ మరియు అభివృద్ధి అవకాశాలను అందించేందుకు రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (RDT) ఆధ్వర్యంలో గ్రామీణ క్రికెట్ టాలెంట్ హంట్ –2026కు మడకశిరలో విశేష స్పందన లభించిందని మచ్చా రామలింగారెడ్డి అన్నారు

అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లాల్లోని 14 మండల కేంద్రాల్లో బాలుర ఎంపిక ట్రయల్స్ 16 సెప్టెంబర్ నుండి 7 అక్టోబర్ 2026 వరకు నిర్వహించబడతాయి.

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన బాలబాలికలను గుర్తించి, వారికి శిక్షణా శిబిరాలు, మ్యాచ్‌లు మరియు తదుపరి అభివృద్ధికి అవసరమైన అవకాశాలను కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.

ఈ ఎంపిక కార్యక్రమంలో RDT క్రికెట్ డెవలప్‌మెంట్ కమిటీ చైర్మన్ ఎం. రామలింగారెడ్డి, RDT RD మల్లికార్జున, ATL సురేంద్ర, మడకశిర క్రికెట్ అసోసియేషన్ సభ్యులు నాగేంద్ర, భక్తర్, సెలెక్టర్లు C. వెంకటేష్, యోగానంద, విజయరాజు, RDT కోఆర్డినేటర్ ప్రవీణ్ మరియు కోచ్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.

ఈ ఎంపిక కార్యక్రమానికి మొత్తం 110 మంది క్రీడాకారులు హాజరయ్యారనీ

ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రికెట్ ప్రతిభను గుర్తించి, వారికి మెరుగైన శిక్షణ అందించేందుకు RDT కృషి చేస్తోందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతపురంలో శిక్షణా శిబిరాలు మరియు మ్యాచ్‌ల ద్వారా క్రీడాకారుల నైపుణ్యాలను అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు.

యువ క్రికెటర్లందరూ ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

🏏 యువ క్రికెటర్లందరికీ శుభాకాంక్షలు!

రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (RDT)


All Rights Reserved By Amaravathi Flash.
Share Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • తిరుపతి
    • కడప (వైఎస్ఆర్ కడప)
    • ఇతర జిల్లాలు
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • తిరుపతి
    • కడప (వైఎస్ఆర్ కడప)
    • ఇతర జిల్లాలు
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )