గుమ్మేపల్లిలో కొవ్వొత్తుల ప్రదర్శన
శింగనమల మండలం, గుమ్మేపల్లి : తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబునాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేసి నేటికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా “న్యాయం గెలిచింది” అనే నినాదంతో గుమ్మేపల్లి గ్రామంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. శిoగనమల
గౌరవ శాసనసభ్యురాలు బండారు శ్రావణిశ్రీ గారి ఆదేశాల మేరకు, జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ ఉపాధ్యక్షులు, రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ కార్య నిర్వాహక కార్యదర్శి డేగల కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో ఈ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, న్యాయం కోసం తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎప్పటికీ పోరాడుతాయని తెలిపారు. చంద్రబాబునాయుడు గారిపై జరిగిన అక్రమ అరెస్టును ఖండిస్తూ, న్యాయం చివరికి గెలిచిందని పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్డేగల లలితమ్మ డేగల శ్రీనివాసులు డేగల హరీష్ డేగల కిరణ్ పెద్ద ఓబులేసు, నరేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.