* రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
* ఆత్మగౌరవం పెంచేలా రక్షణ చట్టానికి మెరుగులు
* స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతాం
* గొడ్డలి పార్టీ హయాంలో బీసీ రిజర్వేషన్ల కుదింపు
* 2 ఏళ్ల కూటమి పాలనలో 90 శాతం హామీల అమలు
* చంద్రబాబు పాలనతో ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లగలుగుతున్నాం
* జగన్ లో స్థానిక ఎన్నికల ఓటమి భయం : మంత్రి సవిత
* విజయవాడలోని గొల్లపూడి బీసీ భవన్ లో బీసీ రక్షణ చట్టంపై అవగాహ సదస్పు
* పాల్గొన్న బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు
విజయవాడ : బీసీల ఆత్మగౌరవం పెంచేలా సీఎం చంద్రబాబునాయుడు పాలిస్తున్నారని, ప్రజల్లోని కూటమి నాయకులు, కార్యకర్తలు గర్వంతో తలెత్తుకుని వెళుతున్నారని, రాబోయే స్థానిక ఎన్నికల్లో తమదే విజయమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ధీమా వ్యక్తంచేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించి తీరుతామని స్పష్టంచేశారు. జగన్ లో మరో ఓటమి భయం కనిపిస్తోందన్నారు. కోర్టుల్లో నిలబడేలా బీసీ రక్షణ చట్టాన్ని రూపొందిస్తున్నామన్నారు. విజయవాడలోని గొల్లపూడి బీసీ భవన్ లో వివిధ బీసీ కార్పొరేషన్ చైర్మన్లతో శనివారం బీసీ రక్షణ చట్టంపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బీసీలంటేనే టీడీపీ అని స్పష్టంచేశారు. బీసీల ఆత్మగౌరవం పెంచేలా సీఎం చంద్రబాబునాయుడు పాలిస్తున్నారన్నారు. గత ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ నిర్వహించిన పాదయాత్రలో బీసీ రక్షణ చట్టం అమలు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడుతూ, బీసీ రక్షణ చట్టం అమలుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కోర్టుల్లో బలంగా నిలబడేలా ఈ చట్టానికి తుదిమెరుగులు దిద్దుతున్నామన్నారు. దీనిలో భాగంగా మంత్రివర్గ ఉప సంఘంతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమావేశాలు నిర్వహించామన్నారు. బీసీలను కులం, వృత్తుల పేరుతో దూషించినా, సంఘ బహిష్కరణలు చేసినా చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామన్నారు. జిల్లాల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామని, రెండు నెలల్లో కేసుల దర్యాప్తు పూర్తి చేసేలా నిబంధనలు రూపొందించామని తెలిపారు. బీసీ రక్షణ చట్టాన్ని కోర్టుల్లో నిలబడేలా రూపొందిస్తున్నామన్నారు. ఇప్పుడు 156 బీసీ కులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేషన్ల చైర్మన్ల నుంచి అభిప్రాయాలు తీసుకున్నామని తెలిపారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏపీలోనే బీసీ రక్షణ చట్టం అమలుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సవిత తెలిపారు.
బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసి తీరుతాం...
స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని మంత్రి సవిత స్పష్టం చేశారు. 19987 అన్న ఎన్టీఆర్ తొలిసారిగా బీసీలకు రిజర్వేషన్లకు అమలు చేశారన్నారు. ఆయన స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు బీసీలకు 34 శాతానికి రిజర్వేషన్లు పెంచారన్నారు. 2019 తరవాత అధికారంలోకి వచ్చిన జగన్ ...బీసీల రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి కుదించారన్నారు. గొడ్డలి పార్టీ చర్యతో బీసీలకు రాజకీయంగా తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. మరోసారి 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి సవిత తెలిపారు.
ధైర్యంగా ప్రజల్లోకి వెళుతున్నాం
కూటమి ప్రభుత్వం ఏర్పడిన 26 నెలల్లో ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 90 శాతం అమలు చేశామని మంత్రి సవిత తెలిపారు. కూటమి ప్రభుత్వం అమలు చేసిన పథకాల్లో అత్యధికంగా బీసీలే లబ్ధిపొందుతున్నారన్నారు. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరో వైపు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం చంద్రబాబునాయుడు చేపడుతున్నారన్నారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా రహదారుల నిర్మాణం చేపట్టామన్నారు. అన్ని ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామన్నారు. ప్రజల్లోకి ధైర్యంగా కూటమి నాయకులు, కార్యకర్తలు వెళ్లేలా సీఎం చంద్రబాబునాయుడు పాలన సాగిస్తున్నారని కొనియాడారు.
త్వరలో ఆదరణ 3.0ను అమలు చేస్తామని మంత్రి సవిత తెలిపారు.
జగన్ కు ఓటమి భయం
సీఎం చంద్రబాబునాయుడు పాలనపై ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతోందని మంత్రి సవిత తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానిదే విజయమని ధీమా వ్యక్తంచేశారు. జగన్ లో మరో ఓటమి భయం కనిపిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీసీ కార్పొరేషన్ల చైర్మన్లకు మంత్రి సవిత దిశానిర్దేశం చేశారు. బీసీ రక్షణ చట్టంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలుకు కృషి చేస్తున్న సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు, మంత్రి నారా లోకేష్ కు, మంత్రి సవితకు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు ధన్యవాదాలు తెలిపారు. మంత్రి సవితకు ఘనంగా సత్కరించారు. అంతకు ముందు మంత్రి సవిత... అన్న ఎన్టీఆర్, మహత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యనారాయణ, పలు బీసీ సంక్షేమ శాఖ కార్పొరేషన్ చైర్మన్లు వీరంకి వెంకట్ గురుమూర్తి, నందం అబద్ధయ్య, పేరేపి ఈశ్వరరావు, నర్సింహాయాదవ్, మల్లెల ఈశ్వర్, దేవేంద్రప్ప, చిలకలపూడి పాపారావు, కొల్లు పెద్ది రాజు, సీఆర్ రాజన్, రుద్రకోటి సదాశివ, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.