Logo
Date of Publish : 10 September 2026, 12:53 am
Editor : Janapati Venkata Ramesh Babu

వార్డులో జనసేన జోరు.. – ప్రజా సమస్యలపై ఫోకస్!

వాణివీధిలో వీర మహిళలతో ఆత్మీయ సమావేశం —
స్థానిక ఎన్నికల వ్యూహంపై చర్చ

కదిరి, సెప్టెంబర్ 9 : కదిరి నియోజకవర్గంలోని కదిరి పట్టణం వాణివీధిలో జనసేన పార్టీ నాయకులు సుదర్శన్ ఆహ్వానం మేరకు బుధవారం సాయంత్రం వాణివీధికి చెందిన వీరమహిళలు, నాయకులు సమావేశం నిర్వహించారు. పట్టణ అధ్యక్షుల చలపతి ఆధ్వర్యంలో, నియోజకవర్గ ఇంచార్జ్ భైరవ ప్రసాద్ ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ ఆత్మీయ సమావేశానికి జనసేన కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
రానున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ బలోపేతం, ప్రజలతో మమేకం, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాల విస్తరణ తదితర అంశాలపై నాయకులు కార్యకర్తలతో చర్చించారు.
అనంతరం వార్డులోని ప్రజలను కలిసి స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకునే దిశగా ముందుకు సాగుతామని నాయకులు హామీ ఇచ్చారు.
ప్రజల సమస్యలను తెలుసుకుని.. వాటి పరిష్కారానికి కృషి చేయడమే జనసేన లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు. ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని తెలిపారు.రాబోయే స్థానిక ఎన్నికలలో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
“ప్రజల సమస్యలే మా ఎజెండా.. పరిష్కారమే మా లక్ష్యం”
సమావేశంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


All Rights Reserved By Amaravathi Flash.
Share Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • తిరుపతి
    • కడప (వైఎస్ఆర్ కడప)
    • ఇతర జిల్లాలు
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • తిరుపతి
    • కడప (వైఎస్ఆర్ కడప)
    • ఇతర జిల్లాలు
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )