Logo
Date of Publish : 12 September 2026, 2:33 pm
Editor : Janapati Venkata Ramesh Babu

స్థానిక ఎన్నికల్లో కూటమిదే విజయకేతనం

*ప్రతి వార్డు, ప్రతి గ్రామంలో గెలుపే లక్ష్యం.. *పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే కందికుంట దిశానిర్దేశం
*నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఎమ్మెల్యే కందికుంట

కదిరి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కదిరి నియోజకవర్గంలోని అన్ని స్థానాల్లో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి విజయమే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కదిరిలో మూడోసారి కూటమి అభ్యర్థే మున్సిపల్ చైర్మన్ అవుతారని, అన్ని వార్డుల్లోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. శనివారం నిర్వహించిన టీడీపీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.
వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలు, దుష్ప్రచారాలను పార్టీ శ్రేణులు సమర్థవంతంగా తిప్పికొట్టాలని సూచించారు. స్థానిక ఎన్నికల అనంతరం కదిరిలో వైసీపీ రాజకీయ ముఖచిత్రం మారిపోతుందని వ్యాఖ్యానించారు. కులాలు, మతాలను నమ్ముకుని రాజకీయాలు చేస్తున్న వారికి ప్రజలే తగిన సమాధానం చెబుతారన్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా ప్రజల కోసం పనిచేయడం మాత్రం ఆపబోనని స్పష్టం చేశారు.
*అభివృద్ధే అజెండా
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని కందికుంట తెలిపారు. కేంద్ర సహకారంతో పోలవరం, అమరావతి వంటి కీలక ప్రాజెక్టులకు పెద్దఎత్తున నిధులు వస్తున్నాయని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగానే కదిరి నియోజకవర్గంలోనూ అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు.
తలుపుల మండలానికి హంద్రీ–నీవా మెయిన్‌ బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా నీరు అందిస్తున్నామని, అదే కాలువ ద్వారా పులివెందుల ప్రాంతానికీ నీటిని అందిస్తున్నామని పేర్కొన్నారు. కదిరి బైపాస్‌ రోడ్డు పనులను త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. అభివృద్ధి పనులకు కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వాటిని అధిగమించి పనులు ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.
కదిరిలో పెండింగ్‌లో ఉన్న టిడ్కో ఇళ్లను మార్చిలోగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని, త్వరలో ఇంటి పట్టాలతో పాటు పక్కా గృహాలను కూడా మంజూరు చేస్తామని తెలిపారు. రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని అన్నారు.
*‘ఇంటింటికీ తెలుగుదేశం’పై సమీక్ష గత 45 రోజులుగా కొనసాగుతున్న‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంపై మండలాలు, గ్రామాలు, బూత్‌ల వారీగా సమావేశంలో సమీక్షించారు. వెనుకబడిన ప్రాంతాల్లో కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని నాయకులు, కార్యకర్తలను ఎమ్మెల్యే ఆదేశించారు. వారం రోజుల్లో ప్రతి ఇంటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని సూచించారు. డోర్‌టుడోర్‌ కార్యక్రమాన్ని 100 శాతం పూర్తి చేసి వివరాలను ‘మై టీడీపీ’ యాప్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.
ఓటర్ల జాబితాపై అప్రమత్తంగా ఉండాలి
ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై పార్టీ శ్రేణులు ప్రత్యేక దృష్టి సారించాలని కందికుంట సూచించారు. ప్రతి ఓటును క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన ఓటర్ల పేర్లు సక్రమంగా ఉన్నాయో లేదో చూడాలన్నారు. అనర్హ, నకిలీ ఓట్లను గుర్తించి బూత్‌ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సమష్టిగా పనిచేయాలని కందికుంట వెంకటప్రసాద్‌ పిలుపునిచ్చారు. ప్రతి గ్రామం, వార్డు, బూత్‌లో కూటమి బలాన్ని పెంచుతూ ప్రజలతో నిరంతరం మమేకం కావాలని సూచించారు.


All Rights Reserved By Amaravathi Flash.
Share Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • తిరుపతి
    • కడప (వైఎస్ఆర్ కడప)
    • ఇతర జిల్లాలు
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • తిరుపతి
    • కడప (వైఎస్ఆర్ కడప)
    • ఇతర జిల్లాలు
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )