Logo
Date of Publish : 11 September 2026, 10:32 am
Editor : Janapati Venkata Ramesh Babu

17వ వార్డులో ప్రజా దర్బార్‌కు విశేష స్పందన

ప్రజా సమస్యలపై వినతులు.. అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు
రూ.7.50 లక్షలతో రోడ్డు పనులకు శ్రీకారం
కదిరి, (అమరావతి వెలుగు): ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. కదిరి మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో శుక్రవారం అధికారులతో కలిసి ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతులు స్వీకరించారు.
వార్డులో రూ.7.50 లక్షలతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రధానంగా ఇంటి స్థలాలు, పింఛన్లకు సంబంధించి నాలుగు వినతులు వచ్చినట్లు తెలిపారు.
*జాతీయ రహదారి దాటుతూ పాఠశాలకు..
వార్డులోని చిన్నారులు పాఠశాలకు వెళ్లేందుకు జాతీయ రహదారి దాటాల్సి వస్తోందని, దీంతో ప్రమాదాల ముప్పు ఉందని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే జాతీయ రహదారుల అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
*311 సర్వే భూమి ఆక్రమణల యత్నం
శ్రీ లక్ష్మీనరసింహస్వామి తీర్థాల్లో ప్రసిద్ధి చెందిన గరుడతీర్థ ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లే మార్గం సర్వే నంబర్ 311 ప్రభుత్వ రికార్డుల్లో కాలువగా నమోదై ఉందని స్థానికులు తెలిపారు. గతంలో కొందరు స్థిరాస్తి వ్యాపారులు భూములు కొనుగోలు చేసి ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యేకు వివరించారు.

సుమారు 70–100 అడుగుల వెడల్పుతో కిలోమీటరు పొడవున విస్తరించి ఉన్న ఈ భూమికి మార్కెట్‌లో అధిక విలువ ఉండటంతో ఆక్రమణలకు అవకాశం ఉందని పేర్కొన్నారు. సర్వే నంబర్ 311 భూమికి శాశ్వత హద్దులు ఏర్పాటు చేసి, ప్రజాప్రయోజనాలకు వినియోగించాలని కోరారు.
దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్.. వెంటనే సర్వే నిర్వహించి హద్దులు నిర్ధారించాలని, ఆక్రమణలను గుర్తించి ప్రభుత్వ భూమిని రక్షించాలని తహసీల్దార్‌ను ఆదేశించారు.
కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అజయ్‌కుమార్, ఎంఆర్‌ఓ రెడ్డిశేఖర్, మాజీ కౌన్సిలర్ సావిత్రమ్మ, పట్టణ అధ్యక్షుడు డైమండ్ ఇర్ఫాన్, పట్టణ ప్రధాన కార్యదర్శి జి.చలపతి, జిల్లా అధికార ప్రతినిధి రాజశేఖర్‌బాబు, పర్వీన్‌భాను, టీడీపీ నాయకులు అనిల్‌కుమార్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Amaravathi Flash.
Share Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • తిరుపతి
    • కడప (వైఎస్ఆర్ కడప)
    • ఇతర జిల్లాలు
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • తిరుపతి
    • కడప (వైఎస్ఆర్ కడప)
    • ఇతర జిల్లాలు
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )