కదిరి, సెప్టెంబర్ 09, (అమరావతి వెలుగు):-టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్టు ఘటనకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా కదిరిలో ‘నిజం గెలిచింది’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆదేశాల మేరకు హిందూపురం రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో 53 దీపాలు వెలిగించారు.
టీడీపీ పట్టణ నాయకులు, మహిళా నాయకురాళ్లు, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ‘నిజం గెలిచింది.. న్యాయం గెలిచింది’ అంటూ నినదించారు. 53 రోజులపాటు చంద్రబాబు జైలు నిర్బంధాన్ని గుర్తు చేసుకుంటూ దీపాలు వెలిగించామని నాయకులు తెలిపారు.
అక్రమాలు ఎన్నాళ్లు దాగవు.. సత్యం ఎన్నటికీ ఓడిపోదు అని పేర్కొన్నారు. చంద్రబాబుపై జరిగిన ప7రిణామాలను ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయంగా అభివర్ణించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ‘నిజం గెలిచింది.. న్యాయం గెలిచింది.. ప్రజాస్వామ్యం గెలిచింది.. చంద్రబాబు నాయకత్వం గెలిచింది’ అంటూ టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు.