కొన్ని ముఖ్యమైన ఆహార నియమాలను కూడా సూచిస్తున్నారు. కూరలు ఉప్పు లేకుండా ఇంకా తక్కువ ఉప్పుతో వండుకోవాలి, నూనె వాడకాన్ని కూడా తగ్గించాలి. ఎక్కువగా కూరలు తినాలి. ఉప్పు ఎక్కువగా తినడం షుగర్‌కు మంచిది కాదని ఆయన చెబుతారు. ఉప్పు మానలేని వారు మెంతుల పొడిని వాడటం మరింత ఉపకరిస్తుంది.అన్నం బదులు పుల్కాలు రెండు పుల్కాలు, ఎక్కువ కూరలతో, జొన్నలు, రాగిముద్ద, కొర్ర అన్నం, అరికెలు వంటి తృణధాన్యాలను తీసుకోవడం మంచిది. రాత్రి భోజనంలో ఉడికించిన ఆహారాలను మానేసి, బాదం, పిస్తా, జీడిపప్పు, పుచ్చ గింజలు, గుమ్మడి గింజలు, కొబ్బరి ముక్కలు వంటి నానబెట్టిన డ్రై నట్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు.