Logo
Date of Publish : 12 September 2026, 3:27 am
Editor : Janapati Venkata Ramesh Babu

జంక్ ఫుడ్ యాడ్స్‌తో పిల్లలకు ముప్పు? బ్యాన్ చేయాలా..? డాక్టర్లు చెప్పిన అసలు పరిష్కారం ఇదే!

  • జంక్ ఫుడ్ యాడ్స్‌కు టైమ్ లిమిట్
  • యాడ్స్ తగ్గితే పిల్లల ఆరోగ్యం మెరుగుపడుతుందా?
  • కార్టూన్లు, సెలబ్రిటీలతో జంక్ ఫుడ్ ప్రమోషన్

పిల్లలకు జంక్ ఫుడ్ తినొద్దంటే ఊరుకుంటారా? అదే కావాలని పట్టుబడుతారు. మారం చేస్తారు.. అదే జంక్ ఫుడ్ అందుబాటులో లేకుండా చేస్తే వాళ్లే తినడం మానేస్తారు.. కానీ, అలా జరగడం లేదు.. సింపుల్‌గా పిల్లలకు తినొద్దని చెప్పడం మాత్రమే సరిపోతుందా? చిప్స్, బర్గర్లు, చాక్లెట్లు, తీపి పానీయాల యాడ్స్ రోజంతా పిల్లలను ఆకర్షిస్తుంటాయి.

అప్పుడు హెల్తీ ఫుడ్ ఎలా ఎంచుకుంటారు. అది వారికి అంత సులభం కాదు. అందుకే, జంక్ ఫుడ్ యాడ్స్ విషయంలో కఠినమైన నిబంధనలు తీసుకురావాలని భారతీయ వైద్యులు, ప్రజారోగ్య నిపుణులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ముఖ్యంగా కొవ్వు, చక్కెర, ఉప్పు ఎక్కువగా ఉండే ఫుడ్స్ (HFSS), హై ప్రాసెస్ ఫుడ్ (UPF) యాడ్స్ నియంత్రించాలని డాక్టర్లు సూచించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఇలాంటి యాడ్స్ లిమిట్స్ విధించాలని చెబుతున్నారు. పిల్లలను ఆకర్షించే కార్టూన్ పాత్రలు, సెలబ్రిటీలు, క్రీడాకారులు, ఆటలు, బహుమతులు, ‘బై వన్ గెట్ వన్’ వంటి ఆఫర్లతో పిల్లలను టార్గెట్ చేయడం కూడా నియంత్రించాలని సూచిస్తున్నారు.

స్కూల్ క్యాంటీన్లలోనూ మార్పులు :
స్కూళ్లలో పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించేలా చర్యలు చేపట్టాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. చక్కెర అధికంగా ఉండే పానీయాలు, జంక్ ఫుడ్‌ను స్కూల్ క్యాంటీన్లలో విక్రయించకుండా నిషేధించాలని చెబుతున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా ఫుడ్ యాడ్స్ పిల్లల ఆహారపు అలవాట్లపై తీవ్ర ప్రభావం చూపుతాయని చెబుతోంది. టీవీతో పాటు యూట్యూబ్, సోషల్ మీడియా, ఆన్‌లైన్ గేమ్స్, ఇన్‌ఫ్లుయెన్సర్ల ద్వారా వచ్చే యాడ్స్ కూడా కంట్రోల్ చేయడం తప్పనిసరిగా సూచిస్తోంది.

ఇతర దేశాల్లో కఠిన ఆంక్షలు :
ఇతర దేశాల్లో జంక్ ఫుడ్‌పై కఠినమైన ఆంక్షలు అమల్లో ఉన్నాయి. చిలీ వంటి దేశాలు జంక్ ఫుడ్‌పై వార్నింగ్ లేబుళ్లు, యాడ్ ఆంక్షలు, స్కూళ్లలో అనారోగ్యకరమైన ఆహారంపై నియంత్రణలు తీసుకొచ్చాయి. దాంతో పిల్లలు జంక్ ఫుడ్ యాడ్స్ చూసే స్థాయి భారీగా తగ్గింది.

భారత్‌లోనూ ఇలాంటి చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు కోరుతున్నారు. ఆహారం ఎంపిక అనేది పిల్లల బాధ్యత మాత్రమే కాదని, వారికి ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం ప్రభుత్వం, పాఠశాలలు, తల్లిదండ్రుల బాధ్యతగా సూచిస్తున్నారు.


All Rights Reserved By Amaravathi Flash.
Share Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • తిరుపతి
    • కడప (వైఎస్ఆర్ కడప)
    • ఇతర జిల్లాలు
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • తిరుపతి
    • కడప (వైఎస్ఆర్ కడప)
    • ఇతర జిల్లాలు
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )