
పోస్టర్లో రమ్యకృష్ణ చాలా గంభీరంగా, పవర్ఫుల్గా కనిపిస్తున్నారు. ఆమె పాత్ర సినిమాలో కీలకంగా ఉండబోతున్నట్లు లుక్ చూస్తే అర్థమవుతోంది. ఈ పోస్టర్ను మంచు మనోజ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. రమ్యకృష్ణతో కలిసి నటించడం గౌరవంగా ఉందని పేర్కొన్నారు. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, పాత్రపై పట్టు అద్భుతమని ప్రశంసించారు.
ఇప్పటికే ఈ సినిమాలో ఉక్రెయిన్ మోడల్, నటి మరియా రియాబోషప్కా ‘క్లారా విట్మోర్’గా నటిస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఆమె పాత్ర ప్రేమతో పాటు ప్రతీకారం, పోరాటంతో ముడిపడి ఉంటుందని చిత్రబృందం గతంలో తెలిపింది.
‘డేవిడ్ రెడ్డి’కి హనుమా రెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తున్నారు. వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. 1897 నుంచి 1922 మధ్య కాలంలో కథ సాగనుంది. చరిత్ర నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ డ్రామాలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు అంశాలు ఉండనున్నాయి.
మంచు మనోజ్ సినీ ప్రయాణం 21 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గత ఏడాది ఆగస్టులో ఈ సినిమాను ప్రకటించారు. తన కెరీర్లో ఇది 21వ చిత్రమని అప్పట్లో వెల్లడించారు.