Logo
Date of Publish : 15 September 2026, 5:10 am
Editor : Janapati Venkata Ramesh Babu

వినాయక చవితికి ‘రామాయణ’ స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్‌.. సీతారాముల పాట విన్నారా?

బాలీవుడ్ 'రామాయణ' నుంచి 'జయ జయ రామ్' పాట విడుదల

రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి ఆకట్టుకున్న వైనం

ఏఆర్ రెహమాన్ స్వరాలు, శ్రేయా ఘోషల్, అర్జీత్ సింగ్ గానం

రావణుడిగా యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్ ప్రధాన పాత్రలు

బాలీవుడ్‌లో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'రామాయణ'. నితీశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. తాజాగా వినాయక చవితి పండుగను పురస్కరించుకుని, చిత్ర బృందం సినిమా నుంచి తొలి పాటను విడుదల చేసింది. 'జయ జయ రామ్' అంటూ సాగే ఈ గీతం శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ పాటలో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి ఎంతో సహజంగా ఒదిగిపోయారు.

 

ఈ పాటకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చగా, కుమార్ విశ్వాస్ సాహిత్యం అందించారు. ప్రముఖ గాయకులు శ్రేయా ఘోషల్, అర్జీత్ సింగ్ తమ గాత్రంతో పాటకు ప్రాణం పోశారు. పాట ఎంతో వినసొంపుగా ఉందని ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

 

ఈ సినిమాలో శ్రీరాముడిగా రణ్‌బీర్, సీతగా సాయి పల్లవి నటిస్తుండగా, రావణుడి పాత్రలో కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్నారు. హనుమంతుడి పాత్రను బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్, లక్ష్మణుడి పాత్రను రవి దూబే పోషిస్తున్నారు. పాటలకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, హాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్ నేపథ్య సంగీతం అందిస్తుండటం విశేషం.


All Rights Reserved By Amaravathi Flash.
Share Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • తిరుపతి
    • కడప (వైఎస్ఆర్ కడప)
    • ఇతర జిల్లాలు
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • తిరుపతి
    • కడప (వైఎస్ఆర్ కడప)
    • ఇతర జిల్లాలు
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )