ఎన్ పి కుంట (అమరావతి ఫ్లాష్) అక్టోబర్ 22 : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పి కొత్తపల్లి పంచాయతీ తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా గడికట్ల తులసి గురువారం నామినేషన్ దాఖలు చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తూ,గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు పంచాయతీ పరిధిలోని గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.ముఖ్యంగా తాగునీరు,రహదారులు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయడంతో పాటు,ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేస్తానని వెల్లడించారు.
ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు నాయకులు, కార్యకర్తలు,సహకారంతో ముందుకు సాగుతానని తెలిపారు. మండల కన్వీనర్ శ్రీరాములు నాయుడు ,భాస్కర్ నాయుడు, డబ్బులు బహుమతులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులతో కలిసి సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు.