Amaravathi Flash
Date of Publish : 25/10/2026, 8:36 am
Published by J.V. Ramesh Babu

వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా హరీష్‌రెడ్డి ప్రచారం

  • ఇంటింటి ప్రచారానికి శ్రీకారం.. అభ్యర్థులకు ప్రజల మద్దతు

ఎన్ పి కుంట, (అమరావతి ఫ్లాష్) అక్టోబర్ 24 : మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఆ పార్టీ నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మండల పరిధిలోని ధనియాని చెరువు గ్రామ పరిధిలో ఉన్న సోమరాజుకుంటలో వైఎస్సార్‌సీపీ నాయకులు ముసల్‌రెడ్డి హరీష్‌రెడ్డి, మండల కన్వీనర్ రంగారెడ్డి, బాలకృష్ణ నాయుడు, ఎంపీటీసీ అభ్యర్థి భగవద్గీత తదితరులు  ఎంపీటీసీ అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఆప్యాయతగా పలకరించారు వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ధనియానీ చెరువు, సోమ రాసుకుంట, కోటిరెడ్డిపల్లి, గోవిందరాజులపల్లి, కొట్టం వారి పల్లి, ముండ్ల వారి పల్లి, గ్రామంలోని ప్రజలను కలిసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రతి గ్రామంలో నాయకులకు గ్రామ ప్రజలు హారతులతో స్వాగతం పలికి పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తమ అభ్యర్థులు పనిచేస్తారని నాయకులు వివరించారు. ప్రచారంలో భాగంగా గ్రామస్తులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగారు.

వైఎస్సార్‌సీపీ నాయకులు నిర్వహించిన ప్రచారానికి గ్రామస్తుల నుంచి విశేష స్పందన లభించిందని పార్టీ శ్రేణులు తెలిపారు. రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బాబ్జాన్, జయరాం రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, బావాజీ, భాస్కర్ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Flash
PDF Share Save