ఆడపడుచు గా ఆదరించండి
తెదేపా ఎంపీటీసీ అభ్యర్థి షేక్ సాదా బాను అభ్యర్తన
ఎన్ పి కుంట, ( అమరావతి ఫ్లాష్), అక్టోబర్ 25: ఆడపడుచు గా ఆదరించి ఎంపిటిసి గా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎన్ పి కుంట 1 పంచాయతీ తెలుగుదేశం పార్టీ ఎంపిటిసి అభ్యర్థి షేక్ సదా భాను కోరారు. మండల పరిధిలోని పెడబల్లి బజార్ లో ఆమె తెదేపా నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు. గ్రామంలో మరింత అభివృద్ధి చెందాలన్న అది కూటమి ప్రభుత్వనికే సాధ్యమన్నారు.సైకల్ గుర్తుకు ఓటు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాలగిరి భాష, దండే రవి, ఆదినారాయణ,రవి, అజంతుల్లా, నరసింహులు నాయుడు, విజయ్, ప్రకాష్, మగ్గం రామాంజి, తదితరులు పాల్గొన్నారు.