కమ్మగుట్టపల్లెలో జోరుగా టీడీపీ ఎన్నికల ప్రచారం
సూపర్ సిక్స్ పథకాలపై ప్రజలకు వివరణ.. సైకిల్ గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి
ఎన్ పి కుంట (అమరావతి ఫ్లాష్) అక్టోబర్ 26 మండలంలోని కమ్మగుట్టపల్లె గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. గ్రామంలో సోమవారం నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అభ్యర్థులు పాల్గొని ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను కలుసుకున్నారు.
ఈ సందర్భంగా టీడీపీ జడ్పిటిసి అభ్యర్థి పోరెడ్డి రాజమ్మ, ఎంపీటీసీ అభ్యర్థి నీ గెలిపించాలని నాయకులు ఓటర్లను కోరారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలతో పాటు ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆర్థిక సహాయం, రైతులకు అందుతున్న ప్రయోజనాలు, యువతకు ఉపాధి అవకాశాలు వంటి అంశాలను ప్రజలకు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
గ్రామాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు నిరంతరం కృషి చేస్తారని నాయకులు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి టీడీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ నాయకులు మండల కన్వీనర్ శ్రీరాములు నాయుడు, దండే రవి, రాజశేఖర్ యాదవ్, ఆసం ప్రతాప్ రెడ్డి, రత్నమయ్య, బయప్ప, బిజెపి నాయకులు కసెట్టి రామ్మోహన్ ,షమీముల్లా, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.