Amaravathi Flash
Date of Publish : 28/10/2026, 5:56 am
Published by J.V. Ramesh Babu

మోసపూరిత హామీలిచ్చిన కూటమి ప్రభుత్వాన్ని ఓడించాలి.

మోసపూరిత హామీలిచ్చిన కూటమి ప్రభుత్వాన్ని ఓడించాలి

ఎన్నికల ప్రచారంలో వైసీపీ నాయకుడు హరీష్ రెడ్డి.                                        ఎన్ పి కుంట: అమరావతి ఫ్లాష్ అక్టోబర్ 27 మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడించాలని వైఎస్సార్‌సీపీ నాయకుడు హరీష్ రెడ్డి పిలుపునిచ్చారు.

మండలంలోని మర్రికొమ్మదిన్నె పంచాయతీలో మంగళవారం వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి ముసల్ రెడ్డి అనురాధమ్మ, ఎంపీటీసీ అభ్యర్థి వేడి గింజల వనజ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ రంగారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ప్రచారంలో పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రెడ్డి, బాలకృష్ణ నాయుడు, రాఘవ, చెన్న కృష్ణారెడ్డి, తిమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అమలు చేయలేని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.

ఈ కార్యక్రమంలో ఆదిరెడ్డి, తిరుమల నాయుడు, ప్రకాష్, చెన్న కృష్ణారెడ్డి, కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, వెంకటేష్ తదితర స్థానిక, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Flash
PDF Share Save