జడ్పిటిసి, ఎంపీటీసీ స్థానాలు గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్సిపి నాయకులు. నాయకులు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తున్న వైసీపీ నాయకుడు హరీష్ రెడ్డి
ఎన్ పి కుంట, (అమరావతి ఫ్లాష్) అక్టోబర్ 28. గెలుపే లక్ష్యంగా వైఎస్సార్సీపీ శ్రేణులు ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు మండలంలోని గోకనపల్లి పంచాయతీలో బుధవారం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండల కన్వీనర్ రంగారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ప్రచారంలో జడ్పీటీసీ అభ్యర్థి ముసల్ రెడ్డి అనురాధమ్మ, ఎంపీటీసీ అభ్యర్థి దుద్దుకుంట వెంకటరెడ్డికి మద్దతుగా ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్థించారు.
ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకుడు హరీష్ రెడ్డి మాట్లాడుతూ.. తమ పార్టీకి మేనిఫెస్టో మాకు భగవద్గీతతో సమానమని పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందేవి అని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.
ప్రజలకు ఇచ్చిన హామీలపై కూటమి నాయకులు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో జడ్పీటీసీ అభ్యర్థి అనురాధమ్మ, ఎంపీటీసీ అభ్యర్థి దుద్దుకుంట వెంకటరెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఈ కార్యక్రమంలో మండల స్థాయి వైఎస్సార్సీపీ నాయకులు రామాంజులు రెడ్డి, వెంకట్రాంరెడ్డి, ఓబుల్ రెడ్డి ,రంగారెడ్డి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
