కస్తూరిబా బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేసిన ఏజీసీడీఓ అనిత
ఎన్.పి.కుంట: (అమరావతి ఫ్లాష్) అక్టోబర్ 29 మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఏజీసీడీఓ అనిత తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యా బోధన, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు.
పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి, పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని సూచించారు. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదువుతూ మంచి మార్కులు సాధించాలని ఆమె ఆకాంక్షించారు.
అనంతరం పాఠశాల పరిసరాలను పరిశీలించి పరిశుభ్రతపై సంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి, స్వయంగా విద్యార్థులకు భోజనం వడ్డించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రిన్సిపాల్ పావని ఉపాధ్యాయులు శోభ, స్వాతి, అరుణ, పార్వతి, పిజిటి శ్రీలత, ఈశ్వరమ్మ, అమీనా, మెహర్ పాఠశాల సిబ్బంది
