Amaravathi Flash
Date of Publish : 30/10/2026, 7:08 am
Published by J.V. Ramesh Babu

పి కొత్తపల్లిలో టిడిపి ఎంపీటీసీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం

పి. కొత్తపల్లిలో టీడీపీ ఎన్నికల ప్రచారం జోరు

ఎం.పి.టి.సి. అభ్యర్థిని గడికట్ల తులసి విజయానికి ఇంటింటా ప్రచారం

ఎన్ పి కుంట, (అమరావతి ఫ్లాష్) అక్టోబర్ 29

గ్రామపంచాయతీ పరిధిలో ఎం.పి.టి.సి. అభ్యర్థిని గడికట్ల తులసి విజయాన్ని కాంక్షిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు మండల కన్వీనర్ శ్రీ రాముల నాయుడు కార్యకర్తలు విస్తృత ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలుసుకుంటూ అభ్యర్థిని గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి పట్టం కట్టాలని ఎంపీటీసీ అభ్యర్థి గడికట్ల తులసి ఓటర్లను వేడుకున్నారు గ్రామ అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం గెలవాలని తెలిపారు ఎన్నికల ప్రచారంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ మల్లెం శ్రీరాముల నాయుడు, మాజీ ఎం.పి.టి.సి. రమణారెడ్డి, సీనియర్ నాయకులు జయచంద్ర రెడ్డి, సుధాకర్, విశ్వనాథ్, శంకర్, సి.ఎన్. మనోహర్, సి. రవీంద్ర, బూత్ కమిటీ సభ్యుడు జయప్ప తదితరులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Flash
PDF Share Save