Amaravathi Flash
Date of Publish : 02/11/2026, 7:38 am
Published by J.V. Ramesh Babu

బీజేపీ జడ్పీటీసీ, కూటమి ఎంపీటీసీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించండి

బీజేపీ జడ్పీటీసీ, కూటమి ఎంపీటీసీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించండి

ఎన్ పి కుంట: (అమరావతి ఫ్లాష్) నవంబర్ 1 మండలంలో బీజేపీ జడ్పీటీసీ అభ్యర్థిని కసెట్టి శివమ్మ, కూటమి ఎంపీటీసీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని కూటమి నాయకులు ఓటర్లను కోరారు. బిజెపి నాయకులు కసెట్టి రామ్మోహన్, షమీముల్లా ఆధ్వర్యంలో వెలిచలమల, గౌకనపల్లి , టి ఎన్ పల్లి, గ్రామాలలో విస్తృత ప్రచారం నిర్వహించారు . ప్రచారంలో భాగంగా గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఇంటింటికీ వెళ్లి కూటమి చేసిన అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలన్నారు .

మైనార్టీల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని నాయకులు తెలిపారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపిస్తే ప్రజల సమస్యల పరిష్కారానికి మరింత కృషి చేస్తామని పేర్కొన్నారు.

ప్రజలు కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలిచి అఖండ మెజార్టీతో గెలిపించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Flash
PDF Share Save