Amaravathi Flash
Date of Publish : 04/11/2026, 7:56 am
Published by J.V. Ramesh Babu

వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించండి

  • ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్‌సీపీ నేతలు హరీష్ రెడ్డి, బాలకృష్ణ నాయుడు పిలుపు

వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించండి

ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్‌సీపీ నేతలు హరీష్ రెడ్డి, బాలకృష్ణ నాయుడు పిలుపు

ఎన్ పి కుంట: (అమరావతి ఫ్లాష్) నవంబర్ 3.

మండలంలో గురువారం జరగనున్న ఒక జడ్పీటీసీ, 9 ఎంపీటీసీ స్థానాల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని మండల ఎన్నికల ఇన్‌చార్జ్ హరీష్ రెడ్డి, బాలకృష్ణ నాయుడు ఓటర్లను కోరారు.

మంగళవారం నల్లగుట్టపల్లితండా, పి.కొత్తపల్లి, పెడపల్లి గ్రామాల్లో వారు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలంటే ప్రజలు ప్రతి ఒక్కరూ వైయస్సార్ పార్టీకి ఓటు వేయాలని తెలిపారు

అధికారంలోకి వస్తే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని విమర్శించారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనలో వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజల ఇంటి వద్దకే అందించామని, ప్రస్తుతం ఆ వ్యవస్థను రద్దు చేసి సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు.

ప్రజా సంక్షేమంపై చిత్తశుద్ధి లేని కూటమి ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని కోరారు. మండల అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సోమిరెడ్డి, పుల్లారెడ్డి, ఇర్షాద్ భాషా గ్రామస్తులు పాల్గొన్నారు

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Flash
PDF Share Save