Amaravathi Flash
Date of Publish : 21/10/2026, 2:02 pm
Published by J.V. Ramesh Babu

శిక్షణలో నేర్చుకున్న అంశాలను విధి నిర్వహణలో వినియోగించుకోవాలి

  • రెవెన్యూ భవన్‌లో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్.
  • తొలి విడతలో 305 మంది సిబ్బందికి శిక్షణ.. సాంకేతిక, పరిపాలనా అంశాలపై అవగాహన పెంచుకోవాలని సూచన.
  • సంక్షేమ, అభివృద్ధి పథకాలు, రెవెన్యూ సేవలను ప్రజలకు వేగంగా, పారదర్శకంగా అందించాలని కలెక్టర్ పిలుపు.

పుట్టపర్తి, అక్టోబర్ 21 (అమరావతి ఫ్లాష్): రెవెన్యూ భవన్‌లో నిర్వహించిన ప్రత్యేక శిక్షణా కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తొలి విడత శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించి, శిక్షణలో పాల్గొన్న సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. శిక్షణలో నేర్చుకునే ప్రతి అంశాన్ని విధి నిర్వహణలో వినియోగించుకోవాలని, తద్వారా ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు. మొదటి బ్యాచ్‌లో మొత్తం 305 మంది సిబ్బంది శిక్షణ పొందుతున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ శిక్షణలోని సాంకేతిక, పరిపాలనా అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలతో పాటు రెవెన్యూ సేవలను ప్రజల గుమ్మం వద్దకు సమర్థవంతంగా తీసుకెళ్లడంలో శిక్షణ పొందిన సిబ్బంది కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Flash
PDF Share Save