ఎన్ పి కుంట .(అమరావతి ఫ్లాష్) అక్టోబర్ 21: సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ పరిధిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థిగా అనురాధమ్మ నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఆమె నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ సందర్భంగా అనురాధమ్మ మాట్లాడుతూ.. మండల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా విద్య, వైద్యం రంగాల్లో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంపొందించడం, మౌలిక వసతుల అభివృద్ధి, గ్రామాల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తానని పేర్కొన్నారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ మండల అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.
కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, హరీష్ రెడ్డి , మండల కన్వీనర్ రంగారెడ్డి పుల్లారెడ్డి, , భయ్యా రెడ్డి, భాష,కార్యకర్తలు పాల్గొన్నారు.