Amaravathi Flash
Date of Publish : 22/10/2026, 7:21 am
Published by J.V. Ramesh Babu

ప్రజలే బలం.. ప్రజా సేవే లక్ష్యం! సర్పంచ్ బరిలో డేరంగుల ఉమాదేవి,

  • అవినీతి లేని, పారదర్శకమైన పాలన
  • ఓటుకు నోటు ఇవ్వను - అవినీతికి తావు ఇవ్వను

నంబులపూలకుంట  మండలం, పెడవల్లి అక్టోబర్ 21 : మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మార్చేందుకు, మీ ఇంటి బిడ్డగా సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నాను. నా ముఖ్య ఉద్దేశం అవినీతి లేని, పారదర్శకమైన పాలనను మీకు అందించడమే.

నా నినాదం – నా ప్రమాణం:

"ఓటుకు నోటు ఇవ్వను - అవినీతికి తావు ఇవ్వను"

నన్ను సర్పంచ్‌గా గెలిపిస్తే నేను చేసే పనులు:

* ప్రభుత్వ నిధుల సద్వినియోగం: ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రూపాయిని దారి మళ్లకుండా, మన గ్రామ అభివృద్ధికి మాత్రమే ఖర్చు చేస్తాను.

* మౌలిక వసతుల కల్పన: గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, మరియు ప్రతి వీధికి ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటు బాధ్యత నాది.

* తాగునీటి సదుపాయం: ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటాను.

* ప్రభుత్వ పథకాలు: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు, పింఛన్లు మరియు ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎలాంటి లంచాలు లేకుండా నేరుగా అందేలా చూస్తాను.

* విద్యా, వైద్య సదుపాయాలు: మన గ్రామ పాఠశాల వసతులను మెరుగుపరుస్తాను, స్థానిక ఆరోగ్య కేంద్రంలో ఎల్లప్పుడూ వైద్యులు, మందులు అందుబాటులో ఉండేలా చూస్తాను.

 నాయకురాలుగా  కాదు, మీ ఇంటి బిడ్డగా నిలబడి అడుగుతున్నాను. డబ్బుతో ఓట్లను కొనే సంస్కృతికి చరమగీతం పాడుదాం. మీ అమూల్యమైన ఓటును నాకు వేసి, అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Flash
PDF Share Save