Amaravathi Flash
Date of Publish : 22/10/2026, 7:49 am
Published by J.V. Ramesh Babu

కూటమి జడ్పీటీసీ అభ్యర్థిగా పోరెడ్డి రాజమ్మ

  ఎన్ పి కుంట (అమరావతి ఫ్లాష్) అక్టోబర్ 21 : నంబులపులకుంట మండల కూటమి జడ్పీటీసీ అభ్యర్థిగా పోరెడ్డి రాజమ్మను ప్రకటించడం పట్ల ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనను అభ్యర్థిగా ఎంపిక చేయడానికి సహకరించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌కు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు.

పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ, కూటమి బలోపేతానికి తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. పార్టీ అధిష్ఠానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజలతో కలిసి పనిచేస్తానని తెలిపారు.

మండలంలోని గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తానని చెప్పారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి అవసరాలను తెలుసుకుని సేవ చేస్తానని పోరెడ్డి రాజమ్మ వెల్లడించారు. కూటమి నాయకులు, కార్యకర్తల సహకారంతో ముందుకు సాగుతూ జడ్పీటీసీ అభ్యర్థిగా తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని ఆమె తెలిపారు. 

మండల కన్వీనర్ శ్రీ రాముల నాయుడు, మండల తెలుగు యువత అధ్యక్షుడు రాజశేఖర్ యాదవ్, చంద్రశేఖర్ నాయుడు, దండే రవి, పాలగిరి భాష, ఆసం ప్రతాప్ రెడ్డి, విజయ్ యాదవ్ ,శేషాద్రి నాయుడు, కార్యకర్తలు అభిమానులు కు ధన్యవాదములు తెలిపారు

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Flash
PDF Share Save