రేపు నెల్లూరు జిల్లాకు మంత్రి లోకేశ్‌.. పలు కార్యక్రమాలకు శ్రీకారం

  • నెల్లూరు నగరంలో ఆధునికీకరించిన రెండు ప్రభుత్వ పాఠశాలల ప్రారంభోత్సవం
  • కోవూరులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న లోకేశ్‌
  • కోవూరు నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమన్వయ సమావేశం
రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ రేపు (సెప్టెంబర్ 16) నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఒకే రోజు రెండు నియోజకవర్గాల్లో ఆయన పలు అభివృద్ధి, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇందుకు సంబంధించిన అధికారిక షెడ్యూల్‌ వివరాలు విడుదలయ్యాయి.

పర్యటనలో భాగంగా తొలుత ఉదయం నెల్లూరు సిటీ నియోజకవర్గానికి చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు స్టోన్ హౌస్ పేటలోని ఆర్ఎస్ఆర్ ప్రభుత్వ పాఠశాల ఆధునీకరణ పనులను, 11:10 గంటలకు మూలపేటలోని డీఎస్ఆర్ ప్రభుత్వ పాఠశాల భవనాన్ని ప్రారంభిస్తారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో ముచ్చటించే అవకాశం ఉంది.

మధ్యాహ్నం కోవూరు నియోజకవర్గంలో పర్యటన కొనసాగుతుంది. 12:15 గంటలకు కోవూరు పట్టణంలోని నెల్లూరు బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చెన్నై-విజయవాడ హైవే వద్ద ఏర్పాటు చేసిన వేదికపై కోవూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నాయకులతో జరిగే సమన్వయ సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేస్తారు. ఈ పర్యటనకు సంబంధించి స్థానిక టీడీపీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :