
నేటి ఆధునిక జీవనశైలిలో డయాబెటిస్ అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. చాలా మంది మందులు వాడుతున్నప్పటికీ, షుగర్ నియంత్రణలోకి రాక ఇబ్బంది పడుతుంటారు. మరికొందరు మందుల వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఆందోళన చెందుతారు. అలాంటి వారికి ప్రకృతి సహజంగా షుగర్‌ను నియంత్రించే మార్గాలపై ఆసక్తి పెరుగుతోంది. మెంతులు షుగర్‌ను అద్భుతంగా తగ్గిస్తాయని డాక్టర్లు, డయాబెటాలజిస్ట్లు అంటున్నారు
డిన్నర్లో కూడా మెంతుల పొడిని వాడటం మంచిది. చాలా మంది రాత్రి భోజనంలో పుల్కా, జొన్న రొట్టె , రాగి రొట్టెతో పాటు కూరలు తింటుంటారు. డిన్నర్ తర్వాత మెంతుల పొడిని కొద్దిగా పెసర నెయ్యి లేదా మజ్జిగలో, పెరుగులో కలుపుకొని తీసుకోవచ్చు. మెంతులు మందు లాగా పనిచేస్తాయి కాబట్టి, లోపలికి వెళ్లడం ముఖ్యం. ఇలా రెండు పూటలా మెంతుల పొడిని తీసుకోవడం వల్ల షుగర్ నియంత్రణ మెరుగుపడుతుంది.








