పెనుకొండలో ఘనంగా వైయస్ఆర్ సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం.

శ్రీ సత్యసాయి జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి, పెనుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి ఉషశ్రీ చరణ్ గారి ఆధ్వర్యంలో పెనుకొండలోని N కన్వెన్షన్ హాల్ నందు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు.

వైయస్ఆర్ సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్, రాజంపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి సమక్షంలో జరిగిన ఈ సమావేశానికి జిల్లాలోని నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంట్ పరిశీలకులు, నియోజకవర్గాల అబ్జర్వర్లు, ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు మాట్లాడుతూ.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే వెన్నెముక, కార్యకర్తలే అసలైన బలం, బలగమని అన్నారు.

ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజలకు అండగా నిలుస్తున్న పార్టీ శ్రేణుల కృషిని అభినందించారు.

పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్తపై ఉందని సూచించారు.

రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు వైయస్ఆర్ సీపీ శ్రేణులు ఇప్పటి నుంచే సమరశంఖం పూరించాలని నాయకులకు సూచించారు.

ప్రజా వ్యతిరేక కూటమి పాలనను ప్రజల్లో ఎండగట్టేందుకు “వెన్నుపోటు పార్టీ.. వెన్నుపోటు పాలన” కార్యక్రమాన్ని గ్రామస్థాయి నుంచి విస్తృతంగా నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు.

గతంలో ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రస్తుతం జరుగుతున్న పాలన మధ్య ఉన్న వ్యత్యాసాలను ప్రజలకు వివరించి వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

పార్టీ ముఖ్య నాయకులకు శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి చేతుల మీదుగా వైయస్ఆర్ సీపీ ఐడెంటిటీ కార్డులను అందజేశారు.

పార్టీ కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తల గుర్తింపును మరింత బలోపేతం చేయడంతో పాటు, ప్రతి స్థాయి నాయకుడు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేలా కార్యాచరణ రూపొందించాలని సమావేశంలో సూచించారు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో జరుగుతున్న జాప్యం, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

గ్రామస్థాయి నుంచి మండల, నియోజకవర్గ స్థాయి వరకు కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించి ప్రజా సమస్యలపై పోరాటాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి ఉషశ్రీ చరణ్ గారు మాట్లాడుతూ.. శ్రీ సత్యసాయి జిల్లాలో వైయస్ఆర్ సీపీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలందరూ సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతామని స్పష్టం చేశారు.

కష్టకాలంలో పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన ప్రతి కార్యకర్తకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయడంతో పాటు, గ్రామస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం కోసం కృషి చేయాలని నాయకులకు సూచించారు.

రాబోయే రోజుల్లో పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా, సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి గ్రామంలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుని, ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం నిరంతరం పోరాడాలని సమావేశంలో నాయకులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో పార్లమెంటరీ పరిశీలకులు రమేష్ రెడ్డి గారు, రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, ధర్మవరం సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు, పుట్టపర్తి సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు, కదిరి సమన్వయకర్త మక్బూల్ గారు, మడకశిర సమన్వయకర్త ఈరలక్కప్ప గారు, హిందూపురం సమన్వయకర్త దీపిక గారు, సీఈసీ సభ్యులు, రాష్ట్ర కార్యదర్శులు, ఎస్‌ఈసీ సభ్యులు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీలు, జిల్లాలో వివిధ పదవుల్లో ఉన్న ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :