మహిళల ఆసియా కప్ విజయం: గాయం నుంచి తిరిగొచ్చి.. ఫీల్డింగ్ మెడల్ మెడల్ అందుకున్న నందిని

  • మహిళల ఆసియా కప్‌లో ఎనిమిదోసారి ఛాంపియన్‌గా నిలిచిన భారత్
  • ఫైనల్‌లో శ్రీలంకపై 72 పరుగుల తేడాతో ఘన విజయం
  • విజయ వేడుకల్లో పాల్గొన్న బీసీసీఐ కార్యదర్శి సైకియా, ఉపాధ్యక్షుడు శుక్లా
  • యువ క్రీడాకారిణి నందిని శర్మకు ఫీల్డింగ్ మెడల్ అందజేత
  • ఈ విజయంతో ఆసియా క్రీడలకు ఆత్మవిశ్వాసంతో వెళ్తామన్న నందిని
దుబాయ్ వేదికగా జరిగిన మహిళల ఆసియా కప్ ఫైనల్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో ఎనిమిదోసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్‌లో శ్రీలంకపై 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ చారిత్రక విజయం తర్వాత దుబాయ్‌లో జరిగిన సంబరాల్లో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా పాల్గొన్నారు. వారు జట్టు సభ్యులను అభినందించి, యువ క్రీడాకారిణి నందిని శర్మకు ఫీల్డింగ్ మెడల్‌ను బహూకరించారు.

గాయం కారణంగా గతంలో డబ్ల్యూపీఎల్, ప్రపంచకప్‌లకు దూరమైన నందినికి ఈ విజయం మరింత ప్రత్యేకంగా నిలిచింది. “గాయం తర్వాత తిరిగి జట్టులోకి రావడం, మొదటి టోర్నీలోనే గెలవడం చాలా ఆనందంగా ఉంది. జట్టు మళ్లీ గెలవడంతో ఈ ఆనందం రెట్టింపు అయ్యింది” అని నందిని పేర్కొంది.

ఫైనల్‌లో శ్రీలంక కెప్టెన్ చమరి అటపట్టును కట్టడి చేయడంపై నందిని మాట్లాడుతూ.. ఈ క్రెడిట్ మొత్తం జట్టు సభ్యులు, సహాయక సిబ్బందికే దక్కుతుందని చెప్పింది. కీలకమైన వికెట్లు అవసరమైనప్పుడు ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ అద్భుతంగా రాణిస్తుందని, ఆమెపై జట్టుకు పూర్తి నమ్మకం ఉందని నందిని పేర్కొంది. దీప్తి ఈ మ్యాచ్‌లో 3 వికెట్లు తీసి జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించింది.

ఆసియా కప్ విజయం తమలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని, ఈ టోర్నీలో చేసిన చిన్నచిన్న పొరపాట్లను సరిదిద్దుకుని రాబోయే ఆసియా క్రీడల్లోనూ గెలుస్తామని నందిని ధీమా వ్యక్తం చేసింది.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :