01/11/2026, Sunday · 09:58:49 PM About UsPrivacy PolicyContact Us
Amaravathi Flash

హర్మూజ్‌ జలసంధిలో నౌకపై దాడి.. సముద్రంలో మునిగిన సింగపూర్‌ షిప్‌

J.V. Ramesh Babu 15/10/2026 2:17 PM అంతర్జాతీయం 32

హర్మూజ్‌ జలసంధిలో నౌకపై దాడి.. సముద్రంలో మునిగిన సింగపూర్‌ షిప్‌
Want this news as a newspaper clip?Print News Clip
  • రెండు సింగపూర్‌ రిజిస్ట్రేషన్‌ నౌకలపై దాడులు జరిగినట్లు సమాచారం
  • జీఎఫ్ఎస్‌ ప్రైడ్‌ నౌక దగ్ధమై సముద్రంలో మునక
  • రెండు నౌకల్లోని 43 మంది సిబ్బంది సురక్షితం
  • నౌక మైన్‌ను ఢీకొని మునిగిపోయిందన్న ఇరాన్‌ నేవీ

హర్మూజ్‌ జలసంధిలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ మార్గంలో ప్రయాణిస్తున్న సింగపూర్‌ రిజిస్ట్రేషన్‌ కలిగిన రెండు కంటైనర్‌ నౌకలపై దాడులు జరిగినట్లు సింగపూర్‌ మారిటైమ్‌ అండ్‌ పోర్ట్‌ అథారిటీ వెల్లడించింది. ఈ ఘటనలో జీఎఫ్ఎస్‌ ప్రైడ్‌ అనే నౌకలో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమై సముద్రంలో మునిగిపోయింది. అయితే, నౌకలోని 21 మంది సిబ్బందిని సురక్షితంగా రక్షించినట్లు అధికారులు తెలిపారు.

మరో నౌక జీఎఫ్ఎస్‌ గిసెల్‌ స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ సురక్షిత ప్రాంతానికి చేరుకుందని, అందులోని 22 మంది సిబ్బంది క్షేమంగా ఉన్నారని వెల్లడించారు. రెండు నౌకల్లోనూ సింగపూర్‌ పౌరులు ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పరిస్థితులను అధికారులు పరిశీలిస్తున్నారు. సముద్ర మార్గంలో ప్రయాణించే ఇతర నౌకలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మరోవైపు, ఈ ఘటనపై ఇరాన్‌ భిన్నమైన వాదనను వినిపించింది. తమ జలాల్లోకి అనధికారికంగా ప్రవేశించిన నౌక నేవల్‌ మైన్‌ను ఢీకొని పేలిపోయిందని ఇరాన్‌ ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ నేవీ పేర్కొంది. నౌకలో 2,500కు పైగా కంటైనర్లు ఉన్నాయని, సముద్రంలో తేలియాడుతున్న కంటైనర్లతో ఇతర నౌకలకు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. హర్మూజ్‌ జలసంధిని తమ నౌకాదళం నిరంతరం పర్యవేక్షిస్తోందని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నేవీ కమాండర్‌ అలీ అజ్మాయీ పేర్కొన్నారు.

ఇదీ చదవండి :: జడ్పిటిసి ,ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న వైయస్సార్ పార్టీ నాయకులు

SingaporeshipsinksStraitHormuz

About the author

J

J.V. Ramesh Babu

Chief Editor

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

59 Posts

Latest News

కొత్తపల్లిలో వైయస్సార్ పార్టీ నాయకులు విస్తృత ప్రచారం వైయస్సార్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం బాలకృష్ణ నాయుడు వెలిచెలమలలో వైయస్సార్ పార్టీ నాయకులు విస్తృత ప్రచారం పి కొత్తపల్లిలో టిడిపి ఎంపీటీసీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేసిన ఏజిసిడిఓ అనిత జడ్పిటిసి ,ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న వైయస్సార్ పార్టీ నాయకులు జడ్పిటిసి ,ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న వైయస్సార్ పార్టీ నాయకులు జడ్పిటిసి ,ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న వైయస్సార్ పార్టీ నాయకులు జడ్పిటిసి ,ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న వైయస్సార్ పార్టీ నాయకులు మోసపూరిత హామీలిచ్చిన కూటమి ప్రభుత్వాన్ని ఓడించాలి.