01/11/2026, Sunday · 09:58:24 PM About UsPrivacy PolicyContact Us
Amaravathi Flash

వెలిచెలమలలో వైయస్సార్ పార్టీ నాయకులు విస్తృత ప్రచారం

prabhakar 30/10/2026 7:20 AM శ్రీ సత్యసాయి 9

వెలిచెలమలలో వైయస్సార్ పార్టీ నాయకులు విస్తృత ప్రచారం
Want this news as a newspaper clip?Print News Clip
  • అడుగడుగునా హారతులు పట్టి స్వాగతం పలుకుతున్న గ్రామ ప్రజలు

వెలిచలమలలో వైఎస్సార్‌సీపీ ప్రచార హోరు

 .. వైసీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి విశేష స్పందన

ఎన్ పి కుంట, (అమరావతి ఫ్లాష్), అక్టోబర్ 29: మండల పరిధిలోని వెలిచలమల పంచాయతీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం విస్తృతంగా సాగింది. జడ్పీటీసీ అభ్యర్థి ముసల్ రెడ్డి అనురాధమ్మ, ఎంపీటీసీ అభ్యర్థి నాగరత్నమ్మకు మద్దతుగా పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు రంగంలోకి దిగి గడపగడపకు ప్రచారం నిర్వహించారు.

ఏడు గ్రామాల్లో ఓటర్లను నేరుగా కలుసుకుంటూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ప్రచారం నిర్వహించగా, పలుచోట్ల గ్రామస్తులు అభ్యర్థులకు హారతులు పట్టి, పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు.

వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ రంగారెడ్డి, సీనియర్ నాయకుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త మునసలి రెడ్డి హరీష్ రెడ్డి, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేశాయి భారతి రెడ్డి, పంచాయతీరాజ్ వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి . పుల్లారెడ్డి తదితరులు అభ్యర్థులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు.

 గ్రామాల్లో విస్తృత ప్రచారం

గోపాలపురం, ఎగువపల్లి, వెలిచాలపల్లె, పడ్డిపల్లి, కేకే తండా, ఎన్.కే. తండా, రామాపురం తండా గ్రామాల్లో నాయకులు ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, గ్రామాల అభివృద్ధికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నాయకులు ప్రపాత్ రెడ్డి, . మహేశ్వర్ రెడ్డి, స్థానిక నాయకులు ఈశ్వర్ రెడ్డి, గోవిందు నాయక్, ఈశ్వర్ నాయక్, గోపాల్, అంజి తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు మద్దతుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

ఇదీ చదవండి :: తుమ్మలూరి భాస్కర్ ఇంటింటి ప్రచారం

వెలిచెలమలలో వైయస్సార్ పార్టీ నాయకులు విస్తృత ప్రచారం

Party leadersWidepublicityYSRVelichelama

About the author

P

prabhakar

Senior Reporter

22 Posts

Latest News

కొత్తపల్లిలో వైయస్సార్ పార్టీ నాయకులు విస్తృత ప్రచారం వైయస్సార్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం బాలకృష్ణ నాయుడు పి కొత్తపల్లిలో టిడిపి ఎంపీటీసీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేసిన ఏజిసిడిఓ అనిత జడ్పిటిసి ,ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న వైయస్సార్ పార్టీ నాయకులు జడ్పిటిసి ,ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న వైయస్సార్ పార్టీ నాయకులు జడ్పిటిసి ,ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న వైయస్సార్ పార్టీ నాయకులు జడ్పిటిసి ,ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న వైయస్సార్ పార్టీ నాయకులు మోసపూరిత హామీలిచ్చిన కూటమి ప్రభుత్వాన్ని ఓడించాలి. కమ్మ గుట్ట పల్లెలో టిడిపి నాయకులు ప్రచారం