01/11/2026, Sunday · 11:03:00 PM About UsPrivacy PolicyContact Us
Amaravathi Flash

అనారోగ్య సమస్యలు ఉన్న ఉపాధ్యాయులను ఎన్నికల విధుల నుండి మినహాయించండి : ఎస్ టి యు

J.V. Ramesh Babu 21/10/2026 11:27 AM శ్రీ సత్యసాయి 19

అనారోగ్య సమస్యలు ఉన్న ఉపాధ్యాయులను ఎన్నికల విధుల నుండి మినహాయించండి : ఎస్ టి యు
Want this news as a newspaper clip?Print News Clip

ఎన్ పి కుంట. (అమరావతి ఫ్లాష్) అక్టోబర్ 20 : స్థానిక సంస్థల ఎన్నికల విధుల నుండి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను, దివ్యాంగులను, వికలాంగులను,పాలిచ్చే తల్లులకు మినహాయింపు ఇవ్వాలని ఎస్టియు జిల్లా అధ్యక్షులు గజ్జల హరిప్రసాద్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామాంజులు యాదవ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెలలో జరగనున్న మున్సిపల్/ కార్పొరేషన్ ఎన్నికల విధుల కోసం జిల్లా వ్యాప్తంగా చాలా మంది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను, వికలాంగులను, చంటి పిల్లల తల్లులను, పదవీ విరమణ దగ్గరలో ఉన్న ఉపాధ్యాయులను నియమించారని తెలిపారు. ఎంతో మానసిక ఒత్తిడితో కూడుకున్న ఎన్నికల వీధుల్లో వికలాంగులను, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను, దివ్యాంగులను , వయసు మీరి పదవీ విరమణకు దగ్గరగా ఉన్న వారిని వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అంధులకు ఎన్నికల విధులనుండి మినహాయింపులు ఇవ్వాలని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నా ఎన్నికల విధులు కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికల విధులు కేటాయించబడి తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను, వికలాంగులను, చంటి పిల్లల తల్లులను, పదవీ విరమణ దగ్గరలో ఉన్న ఉపాధ్యాయుల  నుండి వినతులు స్వీకరించేందుకు జిల్లా కేంద్రంగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి వారి నుండి వినతులను స్వీకరించి వారిని ఎన్నికల విధులు నుండి మినహాయించాలని తెలిపారు. ముందస్తు చర్యల్లో భాగంగా వచ్చే నెలలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో వీరికి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలింగ్ విధులు నిర్వహించే ఉపాధ్యాయులకు పోలింగ్ మరుసటి రోజు OD సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి :: పి కొత్తపల్లిలో టిడిపి ఎంపీటీసీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం

duties STUExcludeteachershealthproblemselectoral

About the author

J

J.V. Ramesh Babu

Chief Editor

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

59 Posts

Latest News

కొత్తపల్లిలో వైయస్సార్ పార్టీ నాయకులు విస్తృత ప్రచారం వైయస్సార్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం బాలకృష్ణ నాయుడు వెలిచెలమలలో వైయస్సార్ పార్టీ నాయకులు విస్తృత ప్రచారం పి కొత్తపల్లిలో టిడిపి ఎంపీటీసీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేసిన ఏజిసిడిఓ అనిత జడ్పిటిసి ,ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న వైయస్సార్ పార్టీ నాయకులు జడ్పిటిసి ,ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న వైయస్సార్ పార్టీ నాయకులు జడ్పిటిసి ,ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న వైయస్సార్ పార్టీ నాయకులు జడ్పిటిసి ,ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న వైయస్సార్ పార్టీ నాయకులు మోసపూరిత హామీలిచ్చిన కూటమి ప్రభుత్వాన్ని ఓడించాలి.