01/11/2026, Sunday · 09:58:01 PM About UsPrivacy PolicyContact Us
Amaravathi Flash

వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థికి పెడబల్లి గ్రామస్తుల బ్రహ్మరథం

prabhakar 26/10/2026 7:06 AM శ్రీ సత్యసాయి 15

వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థికి పెడబల్లి గ్రామస్తుల బ్రహ్మరథం
Want this news as a newspaper clip?Print News Clip
  • హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం

వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థికి పెడబల్లి గ్రామస్తుల బ్రహ్మరథం

ఇంటింటి ప్రచారానికి విశేష స్పందన

ఎన్ పి కుంట (అమరావతి ఫ్లాష్) అక్టోబర్ 25

 మండల పరిధిలోని పెడబల్లి గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి అనురాధమ్మ ,ముసల్ రెడ్డి హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, మహిళలు ఆమెకు ఘనస్వాగతం పలికి హారతులతో ఆదరించారు. ప్రచారంలో భాగంగా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను, అమ్మ ఒడి, రైతు భరోసా, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, పింఛన్ల పెంపు వంటి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. పేద ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా మేలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని కోరారు.

ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పుల్లారెడ్డి, మహేందర్ రెడ్డి, ఇర్షాద్ భాషా, రామకృష్ణ, మునిస్వామి, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: జడ్పిటిసి ,ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న వైయస్సార్ పార్టీ నాయకులు

వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థికి పెడబల్లి గ్రామస్తుల బ్రహ్మరథం

Villagers BrahmarathamPeddaballiYCPZPTCCandidate

About the author

P

prabhakar

Senior Reporter

22 Posts

Latest News

కొత్తపల్లిలో వైయస్సార్ పార్టీ నాయకులు విస్తృత ప్రచారం వైయస్సార్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం బాలకృష్ణ నాయుడు వెలిచెలమలలో వైయస్సార్ పార్టీ నాయకులు విస్తృత ప్రచారం పి కొత్తపల్లిలో టిడిపి ఎంపీటీసీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేసిన ఏజిసిడిఓ అనిత జడ్పిటిసి ,ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న వైయస్సార్ పార్టీ నాయకులు జడ్పిటిసి ,ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న వైయస్సార్ పార్టీ నాయకులు జడ్పిటిసి ,ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న వైయస్సార్ పార్టీ నాయకులు జడ్పిటిసి ,ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న వైయస్సార్ పార్టీ నాయకులు మోసపూరిత హామీలిచ్చిన కూటమి ప్రభుత్వాన్ని ఓడించాలి.