వైయస్సార్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం బాలకృష్ణ నాయుడు

- ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని సూచన
కొత్తపల్లిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ముమ్మర ప్రచారం యువ పారిశ్రామికవేత్త బాలకృష్ణ నాయుడు
ఎన్ పి కుంట, (అమరావతి ఫ్లాష్) అక్టోబర్ 29 మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా సీనియర్ నాయకుడు బాలకృష్ణ నాయుడు ఆధ్వర్యంలో ముమ్మర ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు ఇంటింటికీ వెళ్లి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అమలైన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను సక్రమంగా నెరవేర్చలేదని విమర్శించారు.
వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని బాలకృష్ణ నాయుడు ఓటర్లను అభ్యర్థించారు.
ఈ ప్రచార కార్యక్రమంలో ఎంపీటీసీ అభ్యర్థులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :: పి కొత్తపల్లిలో టిడిపి ఎంపీటీసీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం











