01/11/2026, Sunday · 09:57:45 PM About UsPrivacy PolicyContact Us
Amaravathi Flash

మోసపూరిత హామీలిచ్చిన కూటమి ప్రభుత్వాన్ని ఓడించాలి.

prabhakar 28/10/2026 5:56 AM శ్రీ సత్యసాయి 12

మోసపూరిత హామీలిచ్చిన కూటమి ప్రభుత్వాన్ని ఓడించాలి.
Want this news as a newspaper clip?Print News Clip

మోసపూరిత హామీలిచ్చిన కూటమి ప్రభుత్వాన్ని ఓడించాలి

ఎన్నికల ప్రచారంలో వైసీపీ నాయకుడు హరీష్ రెడ్డి.                                        ఎన్ పి కుంట: అమరావతి ఫ్లాష్ అక్టోబర్ 27 మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడించాలని వైఎస్సార్‌సీపీ నాయకుడు హరీష్ రెడ్డి పిలుపునిచ్చారు.

మండలంలోని మర్రికొమ్మదిన్నె పంచాయతీలో మంగళవారం వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి ముసల్ రెడ్డి అనురాధమ్మ, ఎంపీటీసీ అభ్యర్థి వేడి గింజల వనజ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ రంగారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ప్రచారంలో పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రెడ్డి, బాలకృష్ణ నాయుడు, రాఘవ, చెన్న కృష్ణారెడ్డి, తిమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అమలు చేయలేని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.

ఈ కార్యక్రమంలో ఆదిరెడ్డి, తిరుమల నాయుడు, ప్రకాష్, చెన్న కృష్ణారెడ్డి, కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, వెంకటేష్ తదితర స్థానిక, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: జడ్పిటిసి ,ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న వైయస్సార్ పార్టీ నాయకులు

మోసపూరిత హామీలిచ్చిన కూటమి ప్రభుత్వాన్ని ఓడించాలి.

assured coalitiondeceptivelydefeatgovernment

About the author

P

prabhakar

Senior Reporter

22 Posts

Latest News

కొత్తపల్లిలో వైయస్సార్ పార్టీ నాయకులు విస్తృత ప్రచారం వైయస్సార్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం బాలకృష్ణ నాయుడు వెలిచెలమలలో వైయస్సార్ పార్టీ నాయకులు విస్తృత ప్రచారం పి కొత్తపల్లిలో టిడిపి ఎంపీటీసీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేసిన ఏజిసిడిఓ అనిత జడ్పిటిసి ,ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న వైయస్సార్ పార్టీ నాయకులు జడ్పిటిసి ,ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న వైయస్సార్ పార్టీ నాయకులు జడ్పిటిసి ,ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న వైయస్సార్ పార్టీ నాయకులు జడ్పిటిసి ,ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న వైయస్సార్ పార్టీ నాయకులు కమ్మ గుట్ట పల్లెలో టిడిపి నాయకులు ప్రచారం