తుమ్మలూరి భాస్కర్ ఇంటింటి ప్రచారం

ఎన్పీ కుంట వైసిపి ఎంపీటీసీ-2 అభ్యర్థి తుమ్మలూరి భాస్కర్ విస్తృత ప్రచారం. ఎన్ పి కుంట, (అమరావతి ఫ్లాష్) అక్టోబర్ 25
ఎన్పీ కుంట ఎంపీటీసీ-2 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మలూరి భాస్కర్ పల్లెనీవారిపల్లి, మల్లక్కగారిపల్లి గ్రామాల్లో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికీ వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను, జడ్పిటిసిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
ఈ సందర్భంగా గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, ప్రజలకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ ప్రచార కార్యక్రమంలో రామచంద్ర, కిష్టా, రెడ్డప్ప, లోకేష్, వినయ్, ఆనంద్ , వసుంధర పాటు గ్రామస్తులు, అభిమానులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :: జడ్పిటిసి ,ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న వైయస్సార్ పార్టీ నాయకులు












