కూటమి నాయకులను అఖండ మెజారిటీతో గెలిపించండి.

- అభివృద్ధికి బాటలు వేస్తాం: జనసేన కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ భైరవ ప్రసాద్, సత్యవతి, చౌదరి, కసెట్టి రామ్మోహన్
కూటమి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించండి
అభివృద్ధికి బాటలు వేస్తాం: జనసేన కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ భైరవ ప్రసాద్, సత్యవతి, చౌదరి, కసెట్టి రామ్మోహన్
ఎన్.పి. కుంట: (అమరావతి ప్లాష్) నవంబర్ 2
కూటమి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని జనసేన పార్టీ కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ భైరవ ప్రసాద్, సత్యవతి, చౌదరి, కసెట్టి రామ్మోహన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్.పి. కుంట మండలంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా భైరవ ప్రసాద్ మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని తెలిపారు. గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కూటమి అభ్యర్థులకు ప్రతి ఒక్కరూ ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఎన్.పి. కుంట జడ్పిటిసి అభ్యర్థిగా కసెట్టి శివమ్మను, ఎంపీటీసీ-2 జనసేన అభ్యర్థి అశోక్ విజయాన్ని కాంక్షిస్తూ నాయకులు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసి ప్రచారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు,జనసేన నాయకులు , టీడీపీ నాయకులు , తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :: మహిళలు, బాలికలపై దాడులను అరికట్టడంలో కూటమి ప్రభుత్వం విఫలం













