01/11/2026, Sunday · 11:03:01 PM About UsPrivacy PolicyContact Us
Amaravathi Flash

ఏపీలో ఎన్నికలపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు.. వైసీపీకి బిగ్ రిలీఫ్.. నామినేషన్ల గడువు పెంపు..

AKILESH 21/10/2026 1:45 PM రాష్ట్ర వార్తలు 18

ఏపీలో ఎన్నికలపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు.. వైసీపీకి బిగ్ రిలీఫ్.. నామినేషన్ల గడువు పెంపు..
Want this news as a newspaper clip?Print News Clip

ఆంధ్రప్రదేశ్ : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే మున్సిపాలిటీలకు నామినేషన్ల గడువు ముగిసింది. అయితే, తాజాగా.. సుప్రీంకోర్టు ఏపీ మున్సిపల్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో హింస జరిగిన 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల గడువు పెంచాలని ఆదేశించింది. అంతేకాక.. వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు భద్రత కల్పించాలని ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్ల గడువుపై ఈరోజే నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు.. జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు నామినేషన్లు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈనెల 25 వరకు అభ్యర్థుల తుది జాబితా ప్రకటించొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సమయంలో జరిగిన హింసపై, అవకతవకలపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా.. మున్సిపల్ ఎన్నికల్లో 63.5శాతం వైసీపీ నామినేషన్లు లేకుండా చేశారని, ఇది చాలా తీవ్రమైన చర్య అని వైసీపీ తరపున లాయర్ తన వాదనలు వివినిపించారు. వైసీపీ నేతలను కొట్టి వారిపైనే కేసులు పెట్టారని, ఫిర్యాదులను పోలీసులు తీసుకోవడం లేదని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాడు.

విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగ వ్యవస్థ ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయ తీసుకోవాల్సి ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించింది. అయితే, రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటి వరకూ నిర్ణయం తీసుకోలేదు. అక్టోబర్ 25వ తేదీకి ముందు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించొద్దని ఎన్నికల సంఘాన్ని కోరుతాం. నామినేషన్ల గడువు పొడిగింపుపై ఎన్నికల సంఘం ఈరోజే నిర్ణయం తీసుకోవాలి. ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయం మీకు ప్రతికూలంగా ఉంటే, దాన్ని చట్టవిరుద్ధంగా నామినేషన్ తిరస్కరించిన అంశంగా న్యాయపరంగా ప్రశ్నించే హక్కు మీకు ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే, ఉత్తర్వుల అమలు నివేదిక సుప్రీంకోర్టుకు పంపాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణ ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.

ఇదీ చదవండి :: తుమ్మలూరి భాస్కర్ ఇంటింటి ప్రచారం

Supreme CourtsensationalorderselectionsreliefYSRCPExtensiondeadline

About the author

AKILESH

AKILESH

Senior Reporter

1 Posts

Latest News

కొత్తపల్లిలో వైయస్సార్ పార్టీ నాయకులు విస్తృత ప్రచారం వైయస్సార్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం బాలకృష్ణ నాయుడు వెలిచెలమలలో వైయస్సార్ పార్టీ నాయకులు విస్తృత ప్రచారం పి కొత్తపల్లిలో టిడిపి ఎంపీటీసీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేసిన ఏజిసిడిఓ అనిత జడ్పిటిసి ,ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న వైయస్సార్ పార్టీ నాయకులు జడ్పిటిసి ,ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న వైయస్సార్ పార్టీ నాయకులు జడ్పిటిసి ,ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న వైయస్సార్ పార్టీ నాయకులు జడ్పిటిసి ,ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న వైయస్సార్ పార్టీ నాయకులు మోసపూరిత హామీలిచ్చిన కూటమి ప్రభుత్వాన్ని ఓడించాలి.