ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది

- తొమ్మిది స్థానాలకు 59 నామినేషన్లు దాఖలు
ఎన్ పి కుంట. (అమరావతి ఫ్లాష్) అక్టోబర్ 23 : నంబులపులకుంట మండలంలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మండలంలోని తొమ్మిది ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరిగిన నామినేషన్ల స్వీకరణలో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు మొత్తం 59 నామినేషన్లు దాఖలు చేశారు.
పార్టీల వారీగా తెలుగుదేశం పార్టీ తరఫున 24, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున 31, జనసేన పార్టీ తరఫున 2, స్వతంత్ర అభ్యర్థులుగా మరో 2 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకట్ స్వామి నాయక్, ఎంపీడీవో పార్థసారథి, డిప్యూటీ ఎంపీడీవో మాధవరెడ్డి తదితరులు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించారు.
ఇదీ చదవండి :: తుమ్మలూరి భాస్కర్ ఇంటింటి ప్రచారం











